Parlakhemundi: పర్లాఖెముండిలో మెగా అభిమానులకు 'చిరు బీమా' కార్డుల పంపిణీ!
Parlakhemundi: పర్లాఖెముండిలో మెగాస్టార్ అభిమానులకు రూ. 5 లక్షల చిరు బీమా కార్డుల పంపిణీ. అభిమానుల క్షేమానికి చిరంజీవి పెద్దపీట వేశారని కొనియాడిన ప్రముఖులు.
Parlakhemundi: పర్లాఖెముండిలో మెగా అభిమానులకు 'చిరు బీమా' కార్డుల పంపిణీ!
Parlakhemundi:పర్లాఖెముండి పట్టణంలోని రాజా వీధిలో గల అన్నపూర్ణ ఫంక్షన్ భవనంలో ఆదివారం మెగా అభిమానుల సంఘం అఖిల భారత చిరంజీవి యువత పర్లాకిమిడి చిరంజీవి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మెగా అభిమానులకు చిరు బీమా కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెఠి, అతిథులుగా ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గేదెల చైతన్య , పురపాలక ఉపాధ్యక్షుడు లెంక మధు, ఒడిశా రాష్ట్ర చిరు అభిమానుల సంఘం అధ్యక్షుడు వైఎస్ కన్నా, శ్రీకాకుళం జిల్లా చిరు అభిమానుల సంఘం అధ్యక్షుడు వంజరాపు రాము,గంజాం జిల్లా బ్రహ్మపుర చిరు అభిమానుల సంఘం అధ్యక్షుడు యు అజయ్ కుమార్, ఒడిశా రాష్ట్ర మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షుడు గౌరీ శంకర్ రాణా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి నిర్మల మాట్లాడుతూ ఈ బీమా కార్డులను గజపతి జిల్లాలో కూడా కనిపించడం ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా అందరి అభిమానులకు ఈ బీమా కార్డులు అందజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గేదెల చైతన్య మాట్లాడుతూ లక్షలాది అభిమానులను చిరంజీవి తన ఆత్మీయులుగా భావిస్తుంటారు. నిత్యం అభిమానులకు అండగా నిలిచే చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తనపై అభిమానం చూపిస్తున్న వారికి భరోసాగా నిలిచారు. అభిమానులకు జీవిత బీమా కల్పించారు.దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను తన సినిమాలతో వినోదం అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అభిమానులతో చక్కటి అనుబంధం పంచుకునే చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గొప్ప మానవతావాది అని, అభిమానులను కూడా సొంత మనుషులుగా ఆదరించే గొప్ప మనసున్న మనిషిగా మరోసారి చిరంజీవి నిరూపించుకున్నారు. తన అభిమానులకు బీమా కల్పించారు. చిరంజీవి అభిమానులకు భీమా అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ఇప్పటివరకు ఏ సినీ హీరో కూడా ఆలోచించని విధంగా అభిమానుల ఆరోగ్యం, ఆయా కుటుంబాల బాధ్యతను గుర్తించి సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల చొప్పున బీమా చేయించడం ఒక్క మెగాస్టార్ చిరంజీవికే సాద్యమైందని వెల్లడించారు. అనంతరం 18 మందికి భీమా కార్డులను అందజేశారు.




