Parliament: రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పోరు!

Parliament: ఏప్రిల్ 16 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు 2026 మరియు మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.

Arun Chilukuri
Published on: 15 April 2026 11:34 AM IST
Parliament
X

Parliament: రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పోరు!

Parliament: రేపటి (ఏప్రిల్ 16) నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలకమైన 'డీలిమిటేషన్ బిల్లు-2026' మరియు 'మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు'ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2029 సాధారణ ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.

తాజా ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుండి 816కి పెంచే అవకాశం ఉంది. ఇందులో మూడో వంతు అంటే 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. కొత్త జనాభా గణన (Census) ఆలస్యం కావడంతో, 2011 లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2023లో ఆమోదం పొందిన ఈ చట్టాన్ని వేగంగా అమలు చేయడానికి వీలుగా రాజ్యాంగంలోని 131వ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తోంది.

కేంద్ర నిర్ణయంపై ఇండియా (INDIA) కూటమి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా.. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2011 పాత లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అందుకే 2026 కొత్త జనాభా గణన డేటా వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే మూడు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు వాడీవేడిగా సాగనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story