Parlakhemundi: పర్లాఖెముండిలో వయోవృద్ధుల తీర్థయాత్ర బస్సులు ప్రారంభం!

Parlakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండిలో వయోవృద్ధుల తీర్థయాత్ర బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి. అయోధ్య, వారణాసికి 72 మంది ప్రయాణం.

S.Anil, Gajapati Dst
Published on: 11 Sept 2026 7:42 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండిలో వయోవృద్ధుల తీర్థయాత్ర బస్సులు ప్రారంభం!

Parlakhemundi: పర్లాఖెముండి టుడే:వయోవృద్ధుల తీర్థయాత్రల కోసం ఏర్పాటుచేసిన బస్సులను గజపతి జిల్లా పర్యటకశాఖ ప్రారంభించింది.పర్లాఖెముండి పట్టణంలోని గజపతి క్రీడా మైదానం ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, అతిథి లుగా జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెఠి, అదనపు కలెక్టర్ ఫాల్గుణ మాఝి , జిల్లా సామాజిక భద్రత శాఖ అధికారిణి ఉచ్చర్గీత బడరైత్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిణి అర్చన కుమారి మంగరాజ్, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తీర్థయాత్ర పథకం కింద ఎంతో మంది వయోవృద్ధులు తీర్థయాత్రలకు వెళ్లేందుకు అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మీరంతా వారణాసి, అయోధ్య మందిరాలను జాగ్రత్తగా ఆ ప్రాంతానికి చేరుకొని దేవతామూర్తులను దర్శించుకుని అనంతరం అంతే జాగ్రత్తగా చేరుకోవాలని అన్నారు. అనంతరం పూరి పుణ్యక్షేత్రానికి చూపించేందుకు తాను ప్రత్యేకంగా వృద్ధులను తీసుకువెళ్తానని అన్నారు. జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు మాట్లాడుతూ ఓ ఇంట్లో సొంత కుటుంబం సభ్యులు తీసుకోవలసిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని, మీరంతా స్వామిని దర్శించుకుని

సుఖ కాంతులతో తిరిగి రావాలని కోరారు.

అనంతరం వృద్ధులకు ఎమ్మెల్యే కిట్ లను అందజేశారు. ప్రస్తుతం 72 మంది వృద్ధులను స్వామి వారి దర్శనానికి తీసుకువెళ్లడం జరుగుతుందని, వీరందరూ బ్రహ్మపురం నుంచి శుక్రవారం ప్రత్యేక ట్రైన్ లో వెళ్ళనున్న ట్లు జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి సంగ్రామ్ తెలిపారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst

Next Story