PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం-కిసాన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!

PM Kisan: పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్ల పాటు పొడిగింపు. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పథకం అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

Arun Chilukuri
Published on: 31 July 2026 4:57 PM IST
PM Kisan
X

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం-కిసాన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రతిష్టాత్మక 'పీఎం-కిసాన్‌ సమ్మాన్ నిధి' (PM-Kisan) పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పొడిగింపునకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

పీఎం-కిసాన్ పథకాన్ని రాబోయే ఐదేళ్ల పాటు విజయవంతంగా కొనసాగించేందుకు గాను రూ.3.15 లక్షల కోట్లు ఖర్చు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story