Parliament: ఒకే ఫ్రేమ్‌లో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!
Parliament: పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.
Parliament: ఒకే ఫ్రేమ్‌లో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!
Parliament: రాజకీయాల్లో బద్ధశత్రువులుగా కనిపించే ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య పార్లమెంట్ వేదికగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా, కాసేపు యోగక్షేమాలు చర్చించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతిని పురస్కరించుకుని శనివారం పార్లమెంట్ ప్రాంగణంలోని 'ప్రేరణ స్థల్' వద్ద ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీ తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రధాని మోడీ కార్యక్రమానికి చేరుకోగానే, అక్కడ వేచి ఉన్న రాహుల్ గాంధీకి నమస్కరించారు. అనంతరం ఇరువురు నేతలు పక్కపక్కనే నడుస్తూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ప్రధాని ఏదో చెబుతుండగా రాహుల్ గాంధీ తల ఊపుతూ వింటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. వీరిద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అటు పార్లమెంట్‌లోనూ ఇరు వర్గాల మధ్య పోరు తారాస్థాయిలో ఉంది. ఇలాంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో, దేశంలోని అగ్రనేతలు ఇలా సౌహార్దపూర్వకంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




