PM Modi: వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా: ప్రధాని మోదీ ప్రకటన

PM Modi: వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 14 April 2026 5:16 PM IST
PM Modi
X

PM Modi: వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా: ప్రధాని మోదీ ప్రకటన

PM Modi: ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక నగరం హరిద్వార్‌ వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు వేదిక కానుంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, కుంభమేళాను ప్రపంచం మెచ్చేలా వైభవంగా, అత్యంత పరిశుభ్రంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.

పరిశుభ్రత మనందరి బాధ్యత:

'దేవభూమి'గా పిలవబడే ఉత్తరాఖండ్‌ను శుభ్రంగా ఉంచే బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే లేదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని ప్రధాని కోరారు. కుంభమేళా వంటి పవిత్ర కార్యక్రమాల సమయంలో పుణ్యస్థలాల పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భారతీయ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు. మరో కొద్ది నెలల్లో ప్రారంభం కానున్న మినీ చార్‌ధామ్‌ యాత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

మౌలిక సదుపాయాలతో ఆర్థిక విప్లవం:

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. కొత్తగా ప్రారంభించిన 213 కిలోమీటర్ల హైవే విశేషాలను ఆయన వివరించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుంచి కేవలం రెండున్నర గంటలకు తగ్గనుంది. భక్తుల రాక పెరగడం వల్ల స్థానిక యువతకు ఉపాధి మార్గాలు మెరుగవుతాయని తెలిపారు. రోడ్లు, రైల్వేలు, జల మరియు వాయు మార్గాల అభివృద్ధి దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ఈ ప్రాంత ఆర్థిక స్వరూపాన్ని ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తిగా మారుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story