PM Modi: 40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకండి: మహిళా బిల్లుపై ప్రధాని మోదీ ట్వీట్

PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు లోక్‌సభలో ఓటింగ్. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. నారీ శక్తి వందన్ అధినియమ్ విశేషాలు.

Arun Chilukuri
Published on: 17 April 2026 3:04 PM IST
PM Modi
X

PM Modi: 40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకండి: మహిళా బిల్లుపై ప్రధాని మోదీ ట్వీట్

PM Modi: దేశ చరిత్రలో కీలక ఘట్టంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియమ్)తో పాటు 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులపై నేడు లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు.

నాలుగు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు!

"మహిళా రిజర్వేషన్ బిల్లుపై దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాలు జరిగాయి. కానీ, దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు తమ హక్కులను పొందే సమయం ఇప్పుడు ఆసన్నమైంది" అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నిర్ణయాధికార ప్రక్రియలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న రాత్రి ఒంటి గంట వరకు పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరిగిందని, బిల్లులపై ఉన్న అన్ని అపోహలను ప్రభుత్వం స్పష్టంగా నివృత్తి చేసిందని గుర్తు చేశారు.

"కాసేపట్లో లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును లోతుగా పరిశీలించి, మహిళా రిజర్వేషన్‌కు అనుకూలంగా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను" అని ప్రధాని విన్నవించారు. రాజ్యాంగ సవరణ కావడంతో ఈ బిల్లు నెగ్గాలంటే సభ్యుల మెజారిటీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపుకు విపక్షాల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story