Parlakhemundi: గజపతి జిల్లావ్యాప్తంగా ఘనంగా 'ఆశీర్వాద దీపం'!
Parlakhemundi: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గజపతి జిల్లాలో ఆశీర్వాద దీపం. పెద్ద రాధాకాంత మఠంలో దీపాలు వెలిగించిన అధికారులు.. జిల్లావ్యాప్తంగా 2 లక్షల దీపాలు.
Parlakhemundi: గజపతి జిల్లావ్యాప్తంగా ఘనంగా 'ఆశీర్వాద దీపం'!
Parlakhemundi: దేశ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గజపతి జిల్లా అంతటా గురువారం సాయంత్రం ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు.పర్లాఖెముండి పట్టణంలోని జగన్నాథ మందిర ప్రాంతంలో గల పెద్ద రాధాకాంత మఠంలో అధికారులు దీపాలు వెలిగించే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రెవెన్యూ ఏడీఎం మునీంద్రా హోన్నాగా, జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి దయమయ పాఢి,సబ్ కలెక్టర్ భగత్ సమల్ కళ్యాణ్ రావ్, మిషన్ శక్తి అనుసంధానకర్త తిమన్ బోర తో పాటు మిషన్ శక్తి మహిళలు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ ప్రధాని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కార్యక్రమం చేపట్టినట్లు, జిల్లా అంతటా సుమారు రెండు లక్షలు దీపాలు వెలిగించినట్లు తెలిపారు.




