Union Cabinet Meeting: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రివర్గ విస్తరణ, గ్లోబల్ ఆయిల్ సంక్షోభంపై కీలక చర్చ!

Union Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. మోదీ 3.0 సర్కార్‌లో తొలి మంత్రివర్గ విస్తరణతో పాటు అంతర్జాతీయ చమురు సంక్షోభంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Arun Chilukuri
Updated on: 22 May 2026 12:38 PM IST
Union Cabinet Meeting
X

Union Cabinet Meeting: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రివర్గ విస్తరణ, గ్లోబల్ ఆయిల్ సంక్షోభంపై కీలక చర్చ!

Union Cabinet Meeting: ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ఢిల్లీలో సేవా తీర్థ్‌ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరగనున్న కేంద్ర మంత్రిమండలి సమావేశంలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, పశ్చిమాసియా సంక్షోభంపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రమంత్రులంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. మోడీ 3.O ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్‌ 10 నాటికి ఏడాది కాలం పూర్తి కానుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. జూన్ రెండో వారంలో మార్పులు జరిగే అవకాశం ఉండటంతో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణంపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ సంక్షోభం వల్ల భారతదేశంపై పడే ఆర్థిక ప్రభావం, ముడి చమురు ధరల పెరుగుదల, ఇంధన సరఫరా వంటి అంశాలను ప్రధాని సమీక్షించనున్నారు. మంత్రిత్వ శాఖల పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తారని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story