Cabinet Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ!
Cabinet Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ అసాధారణ సమావేశం. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఢిల్లీలో హై అలర్ట్.
Cabinet Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ!
Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. ప్రభుత్వం అధికారికంగా అజెండాను ప్రకటించలేదు. లోక్ సభలో వీగిపోయిన మహిళా బిల్లు, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా రాబోయే పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసరంగా అమలు చేయాల్సిన కొన్ని కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
దేశ ఆర్ధిక స్థితిగుతులను అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసే నిర్ణయాలు చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో, దేశ వ్యాప్తంగా అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారత విదేశాంగ వాణిజ్య విదానాలపై నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్శించేందుకు కొన్ని కీలకమైన ఆర్ధికసంస్కరణలపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.




