PM Modi Jhalmuri Video: నెట్టింట మోడీ సెన్సేషన్: పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్!
PM Modi Jhalmuri Video: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ సందడి. స్థానిక స్నాక్ 'ఝల్‌మురి' రుచి చూసిన ప్రధాని. విక్రేతతో మోడీ చేసిన సరదా వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
PM Modi Jhalmuri Video: నెట్టింట మోడీ సెన్సేషన్: పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్!
PM Modi Jhalmuri Video: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో సందడి చేశారు. ఆదివారం జార్గ్రామ్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఒక స్థానిక స్నాక్ సెంటర్ దగ్గర ఆగి, బెంగాల్ ఫేమస్ స్నాక్ 'ఝల్‌మురి' (మరమరాలు)ని రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.
ప్రచార విరామ సమయంలో ఝల్‌మురి స్టాల్ వద్దకు వెళ్లిన మోడీ.. "భాయ్.. మాకు మీ ఝల్‌మురి తినిపించండి" అని హిందీలో కోరారు. ఆ సమయంలో విక్రేత "మీరు ఉల్లిపాయలు తింటారా?" అని అడగగా.. మోడీ నవ్వుతూ, "నేను ఉల్లిపాయలు తింటాను, కానీ ఎవరి బుర్రను (దిమాగ్) తినను" అని చమత్కరించారు. ప్రధాని చేసిన ఈ పంచ్‌కు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అనంతరం రూ. 10 చెల్లించి ఆ స్నాక్ తిన్నారు.
సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్
మోడీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మందికి పైగా దీనిని వీక్షించగా, ఫేస్‌బుక్‌లో 9 కోట్ల వ్యూస్ వచ్చాయి. తెలుపు కుర్తా, నీలం వెస్ట్‌కోట్, మెడలో బీజేపీ కండువాతో మోడీ సాధారణ వ్యక్తిలా రోడ్డు పక్కన స్నాక్ తినడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.




