PM Modi: డిసెంబర్‌లో అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన?.. ట్రంప్‌తో కీలక భేటీకి రంగం సిద్ధం!

PM Modi: డిసెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ? ఫ్లోరిడా వేదికగా జరగనున్న జీ20 సదస్సులో పాల్గొని డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Arun Chilukuri
Updated on: 23 Sept 2026 12:32 PM IST
PM Modi
X

PM Modi: డిసెంబర్‌లో అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన?.. ట్రంప్‌తో కీలక భేటీకి రంగం సిద్ధం!

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌లో అమెరికాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 14, 15 తేదీల్లో ట్రంప్ సర్కార్ ఫ్లోరిడాలో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ పర్యటన జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలు విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్, చైనాలపై సుంకాల మోత మోగించేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ బిల్లు’పై ఇటీవల ట్రంప్ సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి దఖలు పడింది.

ఈ సుంకాల ముప్పు నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ-ట్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియోగోర్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ సమావేశంలో వాణిజ్య పరమైన సవాళ్లు, సుంకాల అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.