PM Modi: ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ.. విద్యార్థుల భవిష్యత్తుపై కీలక సూచనలు

PM Modi: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

Arun Chilukuri
Published on: 5 Sept 2026 12:20 PM IST
PM Modi
X

PM Modi: ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ.. విద్యార్థుల భవిష్యత్తుపై కీలక సూచనలు

PM Modi: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చదువుతో పాటు విద్యార్థుల దైనందిన జీవితాలు, నైతిక విలువలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు ప్రధాని సూచించారు. నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోతున్న తరుణంలో, విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో గురువులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. పిల్లల అలవాట్లను గమనిస్తూ, మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

విద్యార్థులు మొబైల్ ఫోన్లు, స్క్రీన్లకు అంకితం కాకుండా క్రీడలు, సృజనాత్మక ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించాలని మోదీ పిలుపునిచ్చారు. తరగతి గది బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా, పిల్లలను బయటకు తీసుకెళ్లి నిజ జీవిత నైపుణ్యాలు, సమాజ పరిస్థితులపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి విద్యార్థిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. కాగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ విభాగాల నుంచి మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story