PM Modi: అవసరమైతే తప్ప బంగారం కొనొద్దు.. మరోసారి దేశప్రజలను కోరిన మోదీ
PM Modi: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి రేటు సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
PM Modi: అవసరమైతే తప్ప బంగారం కొనొద్దు.. మరోసారి దేశప్రజలను కోరిన మోదీ
PM Modi: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలానికి, అంకితభావానికి ఈ వృద్ధి రేటే నిదర్శనమని కొనియాడారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఒక వీడియో విడుదల చేస్తూ దేశ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సరఫరా గొలుసుల దెబ్బతినడం, కొవిడ్ అనంతర ఆర్థిక అనిశ్చితి వంటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్ ఈ అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాని పేర్కొన్నారు.
దేశ ప్రజలు ఎప్పడూ స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.
ఎటుచూసినా సంక్షోభాలు, యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తోందని ప్రధాని స్పష్టం చేశారు.




