PM Modi: రిజీమ్ ఛేంజ్ కామెంట్స్‌పై మోదీ కౌంటర్.. విపక్షాలకు హెచ్చరిక!
PM Modi: దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుండగా, గుజరాత్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
PM Modi: రిజీమ్ ఛేంజ్ కామెంట్స్‌పై మోదీ కౌంటర్.. విపక్షాలకు హెచ్చరిక!
PM Modi: దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుండగా, గుజరాత్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఒక పెద్ద విప్లవం వస్తోందని, త్వరలోనే అధికార మార్పిడి (రిజీమ్ ఛేంజ్) జరగబోతోందంటూ సంజయ్ రౌత్ చేసిన కామెంట్స్‌కు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు.
అసత్యాలు, అబద్ధాలతో అస్థిరతకు కుట్ర: ప్రధాని మోదీ ఆగ్రహం
గుజరాత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ విపక్షాల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టారు. బాహ్య ప్రపంచం నుంచి దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు అంతర్జాతీయంగా పరిష్కారాలు వెతుకుతుంటే, దేశంలోని కొన్ని శక్తులు మాత్రం అబద్ధాలు, అసత్యాలు , వదంతులు వ్యాప్తి చేస్తూ అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
రాజ్యాంగ స్పూర్తిని విపక్షాలు మరిచాయి
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పాలన, విపక్షాల బాధ్యతలపై ప్రధాని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహానీయులు రాజ్యాంగ చట్రాన్ని రూపొందించి, అధికారంలో ఉన్నవారితో పాటు ప్రతిపక్షాలకు కూడా నిర్దిష్ట బాధ్యతలను కేటాయించారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం విపక్షాల హక్కు , బాధ్యత అని, కానీ నేటి ప్రతిపక్షాలు విధానపరమైన వ్యతిరేకతను పక్కనబెట్టి దేశ ప్రగతికి, అభివృద్ధికి అడ్డుపడే అవరోధ శక్తులుగా (Obstructionist force) మారిపోయాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు.




