PM Modi: మహిళా బిల్లును అడ్డుకున్న వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు!

PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకులని, ఈ తప్పిదానికి వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

Arun Chilukuri
Published on: 18 April 2026 2:33 PM IST
PM Modi
X

PM Modi: మహిళా బిల్లును అడ్డుకున్న వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు!

PM Modi: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పార్లమెంట్ హౌస్‌లో తన అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆయన ఈ అంశంపై స్పందిస్తూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు చారిత్రక తప్పిదం చేశాయని, ఈ విషయంలో వారు జీవితాంతం చింతిస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు. "మహిళా సాధికారతకు అడ్డుపడినందుకు ప్రతిపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు రకరకాల సాకులు వెతుకుతున్నారు" అని ప్రధాని మండిపడ్డారు.

ప్రతిపక్ష పార్టీలు మహిళా వ్యతిరేకమనే విషయాన్ని దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరేలా ప్రచారం చేయాలని ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు మరియు మంత్రులకు పిలుపునిచ్చారు. మహిళల హక్కులను కాలరాసిన వారి అసలు నైజాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ లభించకపోవడంతో ఈ కీలక బిల్లు వీగిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story