PM Modi: పాదాలకు నమస్కరించబోయిన చిన్నారి.. ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా?
PM Modi: ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకల్లో ప్రోటోకాల్ పక్కనపెట్టి చిన్నారులను కలిసిన ప్రధాని మోదీ. పడిపోయిన చిన్నారి టోపీని స్వయంగా తీసి తలపై పెట్టిన ప్రధాని. సోషల్ మీడియాలో వీడియో వైరల్.
PM Modi: పాదాలకు నమస్కరించబోయిన చిన్నారి.. ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా?
PM Modi: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగం ముగించిన అనంతరం ఆయన ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి విద్యార్థులు, ఎన్‌సీసీ (NCC) క్యాడెట్లు మరియు 'మై భారత్' వాలంటీర్లను కలిసేందుకు నేరుగా ముందుకు వెళ్లారు.
తన కాన్వాయ్‌ను ఆపించి నడుచుకుంటూ చిన్నారుల వద్దకు వెళ్లిన ప్రధాని, వారితో ముచ్చటిస్తుండగా ఒక ఆసక్తికర మరియు హృదయానికి హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది.
ప్రధాని మోదీని దగ్గరగా చూసిన ఓ చిన్నారి గౌరవంతో ఆయన పాదాలకు నమస్కరించేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఆమె తలపై ఉన్న టోపీ జారి కిందపడిపోయింది. వెంటనే ప్రధాని మోదీ స్వయంగా వంగి ఆ టోపీని చేతుల్లోకి తీసుకుని, ఆ చిన్నారి తలపై పద్ధతిగా పెట్టారు. ప్రధాని చూపించిన ఈ నిరాడంబరత మరియు ఆప్యాయతను చూసి అక్కడున్న వారంతా చప్పట్లతో మార్మోగించారు. ఈ భావోద్వేగ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పసుపు, ముదురు నీలం రంగు దుస్తుల్లో స్వాతంత్ర్య భారత ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులు, ప్రధాని తమ వద్దకు వచ్చి కరచాలనం చేయడంపై తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రధానిని అంత దగ్గరగా చూడటం, తమతో మాట్లాడటం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి అని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.




