PM Modi: నేటి నుంచే పీఎం మోడీ విదేశీ పర్యటన.. ఆరు రోజులు, మూడు కీలక దేశాలు!

PM Modi: నేటి నుంచి ఆరు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Updated on: 6 July 2026 11:41 AM IST
PM Modi
X

PM Modi: నేటి నుంచే పీఎం మోడీ విదేశీ పర్యటన.. ఆరు రోజులు, మూడు కీలక దేశాలు!

PM Modi: నేటి నుంచి ఆరు రోజుల పాటు విదేశాల్లో ప్రధాని నరేంధ్ర మోడీ పర్యటించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని మూడు కీలక దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రతిష్టాత్మక పర్యటనను ప్రారంభించనున్నారు. దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పర్యటన సాగనుంది.

మొదటగా ఇండోనేషియా చేరుకుని, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతో పాటు, జకార్తాలో భారతీయ సమాజంతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story