Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్‌కు ప్రధాని బర్త్‌డే విషెస్.. టచ్ చేశారంటున్న ఫ్యాన్స్!
Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు , కేంద్ర హోంమంత్రి అమిత్ షా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్‌కు ప్రధాని బర్త్‌డే విషెస్.. టచ్ చేశారంటున్న ఫ్యాన్స్!
Pawan Kalyan Birthday Wishes: రాజకీయాల్లో తనదైన శైలితో, ప్రజాసేవే పరమావధిగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురిసింది.
వెండితెరపై పవర్ స్టార్‌గా కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న ఆయన, నేడు ప్రజాక్షేత్రంలో జనసేనానిగా తన మార్కు సుపరిపాలనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ఈ వేడుకల్లో అత్యంత కీలక ఘట్టం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపిన శుభాకాంక్షలు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, పవన్ కల్యాణ్ నాయకత్వ పటిమను ముక్తకంఠంతో కొనియాడారు.
పవన్ కల్యాణ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, సమాజంలో ఎంతో ఆదరణ, గౌరవం సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వ సుపరిపాలన అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో పవన్ ముందు వరుసలో ఉండి నాయకత్వం వహిస్తున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఉత్సాహంగా ప్రజలకు సేవ చేయాలని ప్రధాని ఆకాంక్షించారు.
కేవలం ప్రధాని మాత్రమే కాకుండా, దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ అభివృద్ధిలో, ఎన్డీయే కూటమి విజయవంతమైన పయనంలో పవన్ కల్యాణ్ పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు.
పవన్ కల్యాణ్ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న తీరును ప్రశంసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక అభినందనలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ పవన్ కల్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
సినిమా రంగంలో రికార్డుల రారాజుగా వెలిగిన పవన్ కల్యాణ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు అపారం. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రిగా క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చేందుకు పవన్ పడుతున్న తపన సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.




