NITI Aayog: న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ సమావేశం.. సీఎంలతో ప్రధాని మోదీ భేటీ!
NITI Aayog: న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) సమావేశం ప్రారంభమైంది.
NITI Aayog: న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ సమావేశం.. సీఎంలతో ప్రధాని మోదీ భేటీ!
NITI Aayog: ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన 11వ నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. వికసిత్ భారత్-2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి థీమ్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అన్నిరాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతిఆయోగ్ 11వ పాలకమండలి సమావేశం జరగనుంది. పౌర సమగ్ర శ్రేయస్సు, పార్రిశామికతతోపాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు నీతి అయోగ్ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట, గణనయోగ్య ఫలితాలను అందించడానికి అవలంభించాల్సిన విధానంపై పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన చర్యలపై ప్రధాని మోడీ ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ మోడీ అధ్యక్షతన జరగబోయే నీతిఆయోగ్ 11వ పాలకమండలి సమావేశంలో పాల్గొననున్నారు.




