Modi Diet: 75 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్‌గా ఎలా.? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే..
Modi Diet: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ఉత్సాహంగా పనిచేయగలగడం వెనుక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ప్రధాన కారణం. నరేంద్ర మోదీ హెల్త్ సీక్రెట్ ఏంటో ఆయన మాటల్లోనే.
Modi Diet: 75 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్‌గా ఎలా.? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే..
Modi Diet: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ఉత్సాహంగా పనిచేయగలగడం వెనుక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ప్రధాన కారణం. నరేంద్ర మోదీ హెల్త్ సీక్రెట్ ఏంటో ఆయన మాటల్లోనే.
ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తీసుకునే ఆహారం (Fasting Routine) చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విషయాలను మోదీ ప్రముఖ పోడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్‌కు గతంలోఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఉపవాసం తన శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక స్పష్టతకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆయన చెప్పారు.
ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు
మోదీ ప్రకారం ఉపవాసం అనేది కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు. అది శరీరం, మనసు రెండింటికీ శక్తిని ఇచ్చే ఒక విధమైన ఆధ్యాత్మిక సాధన. ఉపవాస సమయంలో మన ఇంద్రియాలు మరింత చురుకుగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. వాసన, రుచి, స్పర్శ వంటి భావాలు సాధారణంగా కంటే ఎక్కువగా పనిచేస్తాయని చెప్పారు. ఉదాహరణకు, ఉపవాసంలో ఉన్నప్పుడు సాధారణంగా గుర్తించలేని వాసనల్ని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చని మోదీ వివరించారు.
ఉపవాస సమయంలో ఇంద్రియాలు ఎలా మారుతాయి?
మోదీ చెప్పిన ప్రకారం, ఉపవాసంలో ఉన్నప్పుడు మన ఇంద్రియాల ప్రతిస్పందన శక్తి పెరుగుతుంది. సాధారణంగా నీటికి వాసన ఉంటుందని మనం గుర్తించకపోవచ్చు. కానీ ఉపవాసంలో ఉన్నప్పుడు నీటికి కూడా ప్రత్యేకమైన వాసన ఉన్నట్టు అనిపిస్తుందని ఆయన చెప్పారు. అలాగే ఎవరో చేతిలో టీ లేదా కాఫీ తీసుకుని పక్కనగా వెళ్లినా ఆ వాసన స్పష్టంగా తెలుస్తుందని ఆయన వివరించారు. చిన్న పువ్వు దగ్గరగా ఉన్నా దాని సువాసన మరింత స్పష్టంగా గుర్తించగలమని చెప్పారు. అంటే ఉపవాసం సమయంలో మన ఇంద్రియాలు చాలా చురుకుగా మారతాయని ఆయన అభిప్రాయం.
ఉపవాసం వల్ల ఆలోచనలో స్పష్టత
ఉపవాసం వల్ల శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా లాభం ఉంటుందని మోదీ తెలిపారు. ఆయన అనుభవం ప్రకారం ఉపవాస సమయంలో ఆలోచనలు మరింత స్పష్టంగా వస్తాయి. కొత్త ఆలోచనలు చేయగల సామర్థ్యం కూడా పెరుగుతుందని చెప్పారు. సాధారణంగా మనం ఆలోచించని కోణాల్లో కూడా ఆలోచించగలగడం ఉపవాసం వల్ల సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. “ఇది అందరికీ అలాగే ఉండకపోవచ్చు. కానీ నా అనుభవం మాత్రం ఇదే” అని మోదీ అన్నారు.
చాతుర్మాసం సమయంలో మోదీ పాటించే నియమాలు
మోదీ ప్రాచీన భారతీయ సంప్రదాయం అయిన చాతుర్మాసం (Chaturmas) ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఇది సాధారణంగా జూన్ మధ్య నుంచి దీపావళి వరకు నాలుగు నెలలు ఉంటుంది. ఈ సమయంలో ఆయన రోజుకు ఒక్కసారే ఆహారం తీసుకుంటారు. అంటే 24 గంటల్లో ఒక్కసారే భోజనం చేస్తారు. దీని వల్ల శరీరానికి తేలికగా అనిపిస్తుందని ఆయన చెప్పారు.
నవరాత్రి ఉపవాసం: తొమ్మిది రోజులు కేవలం వేడి నీరు
నవరాత్రి సమయంలో మోదీ చాలా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆయన పూర్తిగా ఆహారం తీసుకోరు. ఈ సమయంలో కేవలం వేడి నీరు మాత్రమే తాగుతారు. వేడి నీరు తాగే అలవాటు తనకు చాలా కాలంగా ఉందని మోదీ చెప్పారు. అదే తన రోజువారీ జీవనశైలిలో భాగమైందని తెలిపారు.
ఇంకా చైత్ర నవరాత్రి సమయంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో తొమ్మిది రోజుల పాటు రోజుకు ఒకసారి మాత్రమే ఒకే రకం పండును తింటారు. ఉదాహరణకు ఒకసారి బొప్పాయి ఎంచుకుంటే, తొమ్మిది రోజుల పాటు బొప్పాయి తప్ప ఇంకేదీ తినరని ఆయన చెప్పారు.
గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సందేహం ఉన్నా తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాలి.




