PM Modi: రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన తర్వాత ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? నేడు రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.

Arun Chilukuri
Published on: 18 April 2026 3:55 PM IST
PM Modi
X

PM Modi: రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

PM Modi: దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (PMO) అధికారికంగా ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన తర్వాతి రోజే ప్రధాని ప్రసంగం ఉండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఏ అంశంపై ప్రసంగం?

ప్రధాని ప్రసంగం ప్రధానంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు చుట్టూ ఉండబోతున్నట్లు సమాచారం. శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినా, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆగిపోయింది. దీనిపై ప్రధాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ చారిత్రక తప్పిదానికి ప్రతిపక్షాలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని ఇప్పటికే ఆయన కేబినెట్ భేటీలో హెచ్చరించారు.

రాజకీయ ప్రకంపనలు:

ప్రతిపక్ష పార్టీలు మహిళా వ్యతిరేకమనే విషయాన్ని ఈ ప్రసంగం ద్వారా ప్రధాని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ బిల్లు అమలు కోసం కేంద్రం తీసుకోబోయే తదుపరి చర్యలపై లేదా ఏదైనా సంచలన నిర్ణయంపై ఆయన స్పష్టత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు మరియు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాని ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story