Cabinet Meeting: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం? ఇవాళే కేబినెట్ కీలక సమావేశం!
Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
Cabinet Meeting: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం? ఇవాళే కేబినెట్ కీలక సమావేశం!
Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీ పలు కీలక రాజకీయ, ఆర్థిక అంశాల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూలై రెండో వారంలోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి? ఎవరిని కొనసాగించాలి? అనే అంశాలపై ప్రధాని మోడీ సీనియర్ మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. జూలై రెండో వారంలోనే ఈ మార్పులు మరియు కొత్త మంత్రుల చేరికలు ఉండే అవకాశం బలంగా కనిపిస్తోంది.
రాజకీయ మార్పులతో పాటు దేశ ఆర్థిక రంగానికి సంబంధించిన కీలక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయంగా ఇంధన సరఫరా పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. వీటితో పాటు ప్రజలపై భారం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.




