PM Modi: ఎన్టీఆర్ జయంతి వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్.. ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏం అన్నారంటే?

PM Modi: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 28 May 2026 10:55 AM IST
PM Modi
X

PM Modi: ఎన్టీఆర్ జయంతి వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్.. ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏం అన్నారంటే?

PM Modi: తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజా సంక్షేమం, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు.

పేద, అణగారిన వర్గాలకు సమాజంలో గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ అడుగులు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిపోయింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలు తరతరాలకూ గుర్తుండిపోతాయి. ఎన్టీఆర్ జీవితం, ఆయన ఆశయాలు ఇప్పటికీ కోట్లాది మందికి అపారమైన స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి" అని ప్రధాని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి (NDA) ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలను సాకారం చేయడానికి, రాష్ట్ర ప్రగతికి ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story