PM Modi: పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక.. తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Arun Chilukuri
Published on: 2 Jun 2026 10:39 AM IST
PM Modi
X

PM Modi: పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక.. తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi: పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మోడీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషంగా ఆకట్టుకుంది.వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాలను అభినందించారు. ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి రాష్ట్రం తెలంగాణ అని ప్రధాని కొనియడారు.తెలంగాణ ప్రజలకు మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలూ, విజయాలూ కలగాలని ప్రార్థించారు ప్రధాని నరేంద్ర మోడీ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story