Parlakhemundi: గజపతి జిల్లాలో భారీగా గంజాయి దహనం చేసిన అధికారులు!
Parlakhemundi: గజపతి జిల్లా ఆర్ ఉదయగిరి ఠాణా పరిధిలో స్వాధీనం చేసుకున్న 5,230 కిలోల అక్రమ గంజాయిని ఇన్సినేటర్ యంత్రం ద్వారా దహనం చేసిన పోలీసులు.
Parlakhemundi: గజపతి జిల్లాలో భారీగా గంజాయి దహనం చేసిన అధికారులు!
Parlakhemundi: గజపతి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల క్రితం ఆర్ ఉదయగిరి ఠాణా పరిధిలోని దాడులు చేసి స్వాధీనం చేసుకున్న 5230 కిలోల గంజాయిని పోలీసులు శుక్రవారం దహనం చేశారు.
గంజాం జిల్లా సెరగడ ప్రాంతంలో ఉన్న ఇన్సినేటర్ యంత్రం సహాయంతో బూడిద చేసినట్లు ఎస్పీ ప్రహ్లాద్ సహాని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ ఎస్పీ ప్రదీప్ కుమార్ సాహు, డీఎస్పీ అమితాబ్ పండా తో పాటు ఆర్ ఉదయగిరి ఠాణా అధికారిణి కల్ప లత ప్రధాన్ పాల్గొన్నారు.




