Private Jet Crashes: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం.. కొండల్లో కూలిన ప్రైవేట్ జెట్!
Private Jet Crashes: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాలో ప్రైవేట్ జెట్ ప్రమాదం. అటవీ ప్రాంతంలో చెట్టును ఢీకొని కూలిన విమానం. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.
Private Jet Crashes: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం.. కొండల్లో కూలిన ప్రైవేట్ జెట్!
Private Jet Crashes: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జశ్‌పుర్ జిల్లాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. జిల్లాలోని మారుమూల కొండ ప్రాంతంలో ఒక ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న పలువురు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రైవేట్ జెట్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ఒక భారీ చెట్టును ఢీకొట్టింది. ఆ వెంటనే విమానం కుప్పకూలిపోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ ప్రైవేటు జెట్‌లో మొత్తం ఎంత మంది ప్రయాణిస్తున్నారనే విషయంపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అటవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అడవి మరియు కొండలతో కూడుకున్నది కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిందా లేక వాతావరణం అనుకూలించలేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




