Prakash Raj: కర్ణాటకలో ప్రకాశ్ రాజ్‌కు నిరసన సెగ.. 'గో బ్యాక్' అంటూ ఆందోళనలు!

Prakash Raj: కర్ణాటక విద్యావర్ధక సంఘం 50వ వార్షికోత్సవ ముగింపు సదస్సుకు హాజరైన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయి.

Arun Chilukuri
Published on: 31 Aug 2026 8:34 AM IST
Prakash Raj
X

Prakash Raj: కర్ణాటకలో ప్రకాశ్ రాజ్‌కు నిరసన సెగ.. 'గో బ్యాక్' అంటూ ఆందోళనలు!

Prakash Raj: కర్ణాటక విద్యావర్ధక సంఘం 50వ వార్షికోత్సవాల ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా కొన్ని హిందూ, బీజేపీ అనుబంధ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ కార్యక్రమం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

"నటుడు ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా 'గో బ్యాక్' నినాదాలు చేయగా, మరోవైపు ఆయనకు మద్దతుగా కొందరు నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్తత నడుమ పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు."

బీజేపీకి చెందిన సవితా అమరశెట్టి, రాహుల్ మల్లిగవాడ నేతృత్వంలోని ప్రతినిధులు, పలు సంఘాల కార్యకర్తలు ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా ‘గో బ్యాక్ ప్రకాశ్ రాజ్’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా మరికొందరు ‘ప్రకాశ్ రాజ్‌కు స్వాగతం’ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళం వాతావరణం నెలకొంది.

విద్యావర్ధక సంఘం వేదిక ముందు ఏర్పాటు చేసిన నటుడు ప్రకాశ్ రాజ్ ఫ్లెక్సీ బ్యానర్‌కు వ్యతిరేక వర్గం వారు మసి పూసి, దాన్ని చించివేశారు.

పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు వెంటనే అప్రమత్తమైన పోలీసులు, నటునికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆందోళనకారులను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా నడుమ ప్రకాశ్ రాజ్‌ను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story