Punjab: గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు.. పంజాబ్‌లో హై టెన్షన్
Punjab: పంజాబ్‌లోని జలంధర్ మరియు అమృత్‌సర్‌లలో రాత్రి జరిగిన వరుస పేలుళ్లు కలకలం రేపాయి. బిఎస్‌ఎఫ్ మరియు సైనిక శిబిరాల సమీపంలో పేలుళ్లు సంభవించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఫోరెన్సిక్ బృందాలు విచారణ చేపడుతున్నాయి.
Punjab: గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు.. పంజాబ్‌లో హై టెన్షన్
Punjab: పంజాబ్‌లో పేలుడు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. నిన్న రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు సంభవించాయి. జలంధర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో పేలుళ్లు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొదట జలంధర్‌లో రాత్రి 8 గంటల 15 నిమిషాలకు BSF హెడ్ క్వార్టర్స్ బయట పార్క్ చేసి ఉన్న ఓ బైక్‌లో పేలుడు జరగగా.. ఆ తర్వాత రాత్రి పదిన్నర గంటలకు అమృత్‌సర్ ఖాసా ప్రాంతంలోని సైనిక శిబిరానికి కూతవేటు దూరంలో మరో పేలుడు చోటుచేసుకుంది.
అయితే.. ఈ పేలుడు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు జరగడంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకుని పేలుళ్లకు గల కారణాలపై ఆర తీస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు సాక్ష్యాలను అన్వేషిస్తున్నాయి. మరోవైపు.. పేలుడు ఘటనతో పంజాబ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.




