ED Raids: ఈడీ దాడుల వేళ హైడ్రామా: 9వ అంతస్తు నుంచి కిందకు నోట్ల బ్యాగులు.. డ్రైవర్ పరారీ!
ED Raids: పంజాబ్‌లో ఈడీ సోదాల్లో విస్తుపోయే ఘటన. మొహాలీలో అపార్ట్‌మెంట్ 9వ అంతస్తు నుంచి నోట్ల బ్యాగులను కిందకు విసిరేసిన నిందితులు. డ్రైవర్ ఆ డబ్బుతో పరారవుతున్న వీడియో వైరల్.
ED Raids: ఈడీ దాడుల వేళ హైడ్రామా: 9వ అంతస్తు నుంచి కిందకు నోట్ల బ్యాగులు.. డ్రైవర్ పరారీ!
ED Raids: పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు సినిమాను తలపించే మలుపు తిరిగాయి. ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారన్న భయంతో, నిందితులు కోట్ల రూపాయల నగదు ఉన్న బ్యాగులను కిందకు విసిరేశారు. ఆ బ్యాగులను ఓ డ్రైవర్ క్షణాల్లో వాహనంలో వేసుకుని మాయమవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (GMADA)లో భూవినియోగ అనుమతుల్లో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్, చండీగఢ్‌లోని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మొహాలీలోని ఖరార్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోకి అధికారులు ప్రవేశించగానే.. తొమ్మిదో అంతస్తు నుంచి రూ.500 నోట్ల కట్టలతో నిండిన రెండు పెద్ద బ్యాగులు కిందపడ్డాయి. కింద అప్పటికే సిద్ధంగా ఉన్న ఓ డ్రైవర్, ఆ బ్యాగులను తన వాహనంలో వేసుకుని వేగంగా పరారయ్యాడు.
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నితిన్ గోహల్‌కు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఓఎస్డీ రజబీర్ ఘుమాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నోట్ల బ్యాగులను విసిరేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఘటనపై ఈడీ అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. నిందితుడు ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.




