Paralakhemundi: సర్ ప్రక్రియ అమలు బేష్: దగ్గుపాటి పురందేశ్వరి
Paralakhemundi: పర్లకీముండిలో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ అమలు తీరు బేష్గా ఉందని కొనియాడారు.
Paralakhemundi: సర్ ప్రక్రియ అమలు బేష్: దగ్గుపాటి పురందేశ్వరి
పర్లకీముండి: పర్లాఖెముండి పట్టణంలోని రాజావీధి విశ్వనాథ కళ్యాణ మండపంలో సోమవారం గజపతి జిల్లా భాజపా నాయకులతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా ఎంపీ, ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దగ్గుపాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి విశ్వేశ్వర టుడు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో సర్ ప్రక్రియ పనితీరు బేష్ గా ఉందని కొనియాడారు. అనంతరం వివిధ కమిటీ సభ్యులతో పార్టీ బలోపేతానికి సమీక్షా సమావేశం నిర్వహించారు.
• భాజపా రాష్ట్ర పరిశీలకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఒక్కరోజు జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం కొరాపుట్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాయన్నారు.




