Rahul Gandhi: రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఢీ
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఆయన కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఢీ
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లో ఆయన కాన్వాయ్ ఘోర ప్రమాదానికి గురైంది. సుల్తాన్‌పూర్‌లోని ఒక కోర్టులో నడుస్తున్న కేసు విచారణ నిమిత్తం ఆయన రోడ్డు మార్గాన వెళ్తుండగా.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
సుల్తాన్‌పూర్ వైపు కాన్వాయ్ వేగంగా వెళ్తున్న సమయంలో వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని ఐదు వాహనాలతో పాటు ఒక అంబులెన్స్ ఒకదానినొకటి వెనుక నుంచి బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.




