Rahul Gandhi: మాకు కావాల్సింది చర్యలు.. వీడియోలు కావు: ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్!

Rahul Gandhi: ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సీజేపీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించారు.

Arun Chilukuri
Published on: 25 July 2026 2:30 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: మాకు కావాల్సింది చర్యలు.. వీడియోలు కావు: ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్!

Rahul Gandhi: పరీక్షల అక్రమాలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా కాక్రోచ్ జనతాపార్టీ (CJP) చేపట్టిన నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనల్లో భాగంగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల బృందాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ప్రత్యక్షంగా కలిసి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిలువెత్తు ప్రతీకగా మారారని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి తప్పించి మరో శాఖకు బదిలీ చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, కానీ ఆయనను మంత్రివర్గం నుంచి పూర్తిగా తొలగించడం మినహా విద్యార్థులకు మరేదీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

అర్ధరాత్రి వేళల్లో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోల గురించి ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. "దేశ విద్యార్థులకు కావాల్సింది ప్రధాని షేర్ చేసే వీడియోలు కాదు.. అక్రమాలపై తీసుకునే కఠిన చర్యలు" అని హితవు పలికారు.

"విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే దిగిరావాలి. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు విద్యార్థుల వెంటే ఉండి పోరాడతాం." అని రాహుల్ గాంధీ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story