INDIA Bloc Protest: సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దిల్లీలో హైటెన్షన్.. బారికేడ్లెక్కి నిరసన తెలిపిన రాహుల్ గాంధీ!
INDIA Bloc Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ దిల్లీలో ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
INDIA Bloc Protest: సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దిల్లీలో హైటెన్షన్.. బారికేడ్లెక్కి నిరసన తెలిపిన రాహుల్ గాంధీ!
INDIA Bloc Protest: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని దిల్లీలో ఇండియా కూటమి (INDIA Bloc) నేతల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ఉదయం పార్లమెంట్ మకర ద్వారం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం (నిర్వాచన్ సదన్) దిశగా ఇండియా కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. 'సేవ్ డెమోక్రసీ' (ప్రజాస్వామ్యాన్ని రక్షించండి) బ్యానర్లు ప్రదర్శిస్తూ సీఈసీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఇండియా కూటమి ర్యాలీని ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లెలకార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు పలువురు నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
ఉద్రిక్తత మరింత పెరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఏకంగా బారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండాను చేతపట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి, ఈసీ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీగా ముందుకు వెళ్తున్నారనే కారణంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఇండియా కూటమి ప్రముఖ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో దిల్లీలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.




