Rahul Gandhi: హాస్టల్స్ లేక అమ్మాయిలు అర్ధంతరంగా చదువులు మానేస్తున్నారు: మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ!

Rahul Gandhi: నగరాల్లో విద్యార్థినులకు సరిపడా వసతి గృహాలు ఎందుకు నిర్మించలేకపోతున్నారని ప్రధాని మోదీని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 21 Sept 2026 11:16 AM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: హాస్టల్స్ లేక అమ్మాయిలు అర్ధంతరంగా చదువులు మానేస్తున్నారు: మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ!

Rahul Gandhi: నగరాల్లో చదువుకునే విద్యార్థినుల వసతి సమస్యలపై లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఇందౌర్‌లో విద్యార్థినులతో తాను నిర్వహించిన సమావేశానికి సంబంధించిన అనుభవాలను ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. విద్యా సంస్థల్లో హాస్టల్ గదులు లేకపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి సూటి ప్రశ్నలు సంధించారు.

‘‘ప్రమిదలు వెలిగించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులుంటాయి కానీ, అమ్మాయిల చదువుకోసం హాస్టళ్లు నిర్మించడానికి మాత్రం డబ్బులు ఉండవా?’’ అని ఓ గ్రామం నుంచి నగరానికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థిని తను నిలదీసినట్లు రాహుల్ తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ అందుబాటులో లేక బయట అద్దెకు ఉంటున్నామని, ప్రతినాడూ అద్దె చెల్లించలేక అర్ధంతరంగా చదువులు మానేసే దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

విద్యార్థినులకు ప్రభుత్వం అందించే వసతి భత్యం ప్రస్తుత ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా పెరగడం లేదని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ఆ భత్యాన్ని పొందడానికి కూడా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ మండిపడ్డారు.

వసతి లేమితో చాలామంది అమ్మాయిలు తమ ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ.. "మోదీజీ.. ఈ చిన్నారుల ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా?" అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.