Rahul Gandhi: సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు..
Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన భారీ నిరసనల అనంతరం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
Rahul Gandhi: సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు..
Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన భారీ నిరసనల అనంతరం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు ప్రియాంక గాంధీ, అభిషేక్ మను సింఘ్వీ తదితర సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం ముగిసిన తర్వాత, పార్టీకి చెందిన ఒక ప్రతినిధి బృందానికి అత్యున్నత న్యాయస్థానంలోకి ప్రవేశించడానికి అనుమతి లభించింది. ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా పేర్కొంటూ 'ఇండియా' కూటమికి చెందిన పదకొండు మంది ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాన జడ్జితో భేటీపై ఊహాగానాలు..
ఈ పరిణామాల నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రతినిధి బృందం భారత ప్రధాన న్యాయమూర్తిని (CJI) కలవడానికి ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ప్రధాన జడ్జితో సమావేశం కావడానికి కచ్చితమైన ప్రోటోకాల్స్, ముందస్తు అపాయింట్‌మెంట్‌లు ఉండాలని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి ముందు కూడా ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేని సమావేశాలను తిరస్కరించిన చీఫ్ జస్టిస్, అప్పీళ్లు లేదా ఫిర్యాదులను అధికారికంగా పిటిషన్ల రూపంలోనే దాఖలు చేయాలని స్పష్టం చేశారు.
న్యాయపరమైన లాంఛనాల కోసమే నేతల రాక..
మరుసటి రోజు (మంగళవారం) కోర్టులో జరగనున్న విచారణకు ముందు, రిజిస్ట్రార్ సమక్షంలో అవసరమైన లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి, సంతకాలు చేసే నిమిత్తమే ఈ నేతలు సుప్రీంకోర్టు కారిడార్లకు వచ్చారని న్యాయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యాంగ సంస్థల తీరును నిరసిస్తూ వీధుల్లో ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు, ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం జరగనున్న ఈ కీలక విచారణపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.




