ట్రైన్ టికెట్ నుంచి రైల్ మదద్ వరకు.. ఒక్క రైల్ వన్ యాప్‌తో ఇన్ని ఉపయోగాలా..!
Rail One App: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం RailOne యాప్ వచ్చేసింది. టికెట్ బుకింగ్, PNR, లైవ్ స్టేటస్, ఫుడ్, రైల్ మదద్ అన్ని సేవలు ఒకే యాప్‌లో పొందండి.
ట్రైన్ టికెట్ నుంచి రైల్ మదద్ వరకు.. ఒక్క రైల్ వన్ యాప్‌తో ఇన్ని ఉపయోగాలా..!
Rail One App: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణం చేస్తుంటారు. రిజర్వేషన్ టికెట్ నుంచి జనరల్ టికెట్ వరకు, PNR చెక్ చేయడం వరకు చాలా మంది రైల్వే కౌంటర్ వద్ద క్యూలో నిలబడతారు లేదా వేర్వేరు యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటారు.
ఇప్పుడు ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ భారతీయ రైల్వే A To Z సేవల కోసం ఒకే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరే Rail One App. ఈ యాప్ సహాయంతో రిజర్వేషన్ నుంచి జనరల్ టికెట్ వరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, రైల్ మదద్, రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ కూడా చూడవచ్చు.
ఒకే లాగిన్‌తో అన్ని సేవలు..
రైట్ వన్ యాప్‌లో లాగిన్ చేయడం చాలా సులభం. ఒక్క లాగిన్‌తో అన్ని సేవల ప్రయోజనం పొందవచ్చు. ప్రయాణం సమయంలో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో ఆర్ వ్యాలెట్ సౌకర్యం కూడా ఉది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.
రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ ఫీచర్లు..
రైల్ వన్ యాప్ సహాయంతో మీ కోసం మరియు మీ కుటుంబం కోసం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇందులో స్లీపర్, ఏసీ టికెట్లను బుక్ చేయవచ్చు.
జనరల్ టికెట్ తీసుకోవడం సులభం..
రైల్ వన్ యాప్ సహాయంతో జనరల్ టికెట్ తీసుకోవడం సులభం. ఇందుకోసం స్టేషన్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత మీ కోసం, మీ కుటుంబం కోసం జనరల్ టికెట్ కొనుగోలు చేయవచ్చు.
ప్లాట్‌ఫాం టికెట్ కూడా కొనవచ్చు..
రైల్ వన్ యాప్ సహాయంతో ప్లాట్‌ఫాం టికెట్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. స్టేషన్‌లోకి వెళ్లడానికి ప్లాట్‌ఫాం టికెట్ అవసరం. మీరు ఎవరినైనా రైల్వే ప్లాట్‌ఫాం వరకు దింపడానికి వెళ్తుంటే, ఇది తప్పనిసరి టికెట్.
లైవ్ ట్రైన్ స్టేటస్ చెక్ చేయడం సులభం..
రైల్ వన్ యాప్ సహాయంతో లైవ్ ట్రైన్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు. దీంతో రైలు ఎక్కడి వరకు చేరుకుంది, ఎంత లేట్ అయిందో చూడవచ్చు. అంతేకాకుండా కోచ్ పొజిషన్, పీఎన్ఆర్ స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.




