Train Fire Accident : రాజధాని ఎక్స్‌ప్రెస్ లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు.!

Train Fire Accident : మధ్యప్రదేశ్‌లోని రత్లాం దగ్గర ఈరోజు ఉదయం ఒక పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పింది.

G Krishna
Published on: 17 May 2026 11:22 AM IST
Train fire Accident
X

Train fire Accident

Train Fire Accident : మధ్యప్రదేశ్‌లోని రత్లాం దగ్గర ఈరోజు ఉదయం ఒక పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కేరళ నుండి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని ఒక ఏసీ కోచ్‌లో హఠాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, రైల్వే స్టాఫ్ అలర్ట్ అయి టైమ్‌కి స్పందించడం, ప్యాసింజర్లను సేఫ్‌గా బయటకు తీసుకురావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఉదయాన్నే ఒక్కసారిగా మంటలు

తిరువనంతపురం నుండి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 12431) ఈ ఉదయం మధ్యప్రదేశ్ రత్లాం డివిజన్ గుండా వెళ్తోంది. ఉదయం కరెక్ట్‌గా 5:15 టైమ్‌లో, విక్రమ్‌గఢ్ ఆలోట్ - లూనీ రిచ్చా స్టేషన్ల మధ్య ట్రైన్ రన్ అవుతుండగా, బి-1 (B-1) ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ టైమ్‌లో ఆ కోచ్‌లో 68 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ట్రైన్ ట్రాక్స్ పక్కనే ఉన్న చెట్లకు కూడా ఈ మంటలు స్పీడ్‌గా వ్యాపించాయి. ఆ కోచ్ నుండి దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

అలర్ట్ అయిన రైల్వే స్టాఫ్

మంటలను చూసిన వెంటనే రైల్వే అఫీషియల్స్, స్టాఫ్ అలర్ట్ అయ్యారు. సేఫ్టీ కోసం ఫస్ట్ ట్రైన్‌కు ఉన్న ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ సప్లై (OHE) పవర్‌ను వెంటనే కట్ చేశారు. ఆ తర్వాత మంటలు వచ్చిన బి-1 కోచ్‌ను మిగిలిన ట్రైన్ పెట్టెల నుండి సక్సెస్‌ఫుల్‌గా విడదీశారు. దీనివల్ల మంటలు పక్కన ఉన్న వేరే కోచ్‌లకు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం ఆగిపోయింది.

ప్యాసింజర్స్ సేఫ్.. వేరే కోచ్‌లలో అరేంజ్‌మెంట్స్

కోచ్‌లోని ప్యాసింజర్స్ అందరినీ ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్‌గా రక్షించినట్లు రైల్వే డిపార్ట్‌మెంట్ అనౌన్స్ చేసింది. వారి జర్నీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అందరినీ అదే ట్రైన్‌లోని వేరే కోచ్‌లలో అడ్జస్ట్ చేసి కోటా స్టేషన్ వరకు పంపించారు. ఈ ట్రైన్ ఉదయం 11 గంటలకు కోటా స్టేషన్‌కు చేరుకుంటుందని, ప్యాసింజర్స్ కోసం అక్కడ మరో అదనపు ఏసీ కోచ్‌ను యాడ్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కేరళలో బయలుదేరి, ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ చేరాల్సి ఉంది. దాదాపు 2,500 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ అయ్యాక, ఢిల్లీకి ఇంకో 650 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు కారణం ఏంటనే దానిపై రైల్వే శాఖ ఎంక్వైరీ చేస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story