Rajnath Singh: భారత్‌ను కెలికితే అంతే సంగతి.. పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్!
Rajnath Singh: పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది.. పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఆపరేషన్ సిందూర్ గుర్తుందా? అంటూ బెర్లిన్ వేదికగా పాక్‌కు చురకలు.
Rajnath Singh: భారత్‌ను కెలికితే అంతే సంగతి.. పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్!
Rajnath Singh: పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన, ఒక సభలో మాట్లాడుతూ భారత్‌ను ప్రమాదంలో పడేయాలని చూస్తే మా స్పందన ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసని హెచ్చరించారు. పొరుగు దేశాలన్నీ సఖ్యతగానే ఉన్నా, ఒక దేశం మాత్రం నిరంతరం సమస్యలు సృష్టిస్తోందని పాక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
"భారత్ చరిత్రలో ఎప్పుడూ ఏ దేశంపై కావాలని దాడి చేయలేదు. కానీ ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం మా ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంటుంది (డాట్.. డాట్.. డాట్..)" అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత సైనిక వ్యవస్థ మునుపటి కంటే ఎంతో దృఢంగా మారిందని, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల కోల్‌కతాపై దాడి చేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రతిస్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. "భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో ఏం చేసిందో మీకు తెలిసే ఉంటుంది కదా!" అంటూ గతాన్ని గుర్తు చేస్తూ చురకలు అంటించారు. పిరికిపందల్లా అమాయక పర్యాటకులపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
గతేడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో మరణించిన 26 మందికి రాజ్‌నాథ్ సింగ్ 'ఎక్స్' వేదికగా నివాళులర్పించారు. "పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నా హృదయపూర్వక నివాళులు. ఆ కుటుంబాల బాధను దేశం పంచుకుంటోంది. జాతికి తగిలిన ఆ దెబ్బను ఎప్పటికీ మర్చిపోలేం" అని ఆయన భావోద్వేగంగా పోస్ట్ చేశారు.




