Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల: జూన్ 18న పోలింగ్.. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు

Rajya Sabha Elections 2026: దేశంలో రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

Arun Chilukuri
Updated on: 22 May 2026 12:24 PM IST
Rajya Sabha Elections 2026
X

Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల: జూన్ 18న పోలింగ్.. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు

Rajya Sabha Elections 2026: దేశంలో రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. రాబోయే జూన్, జులై నెలల్లో మొత్తం 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో.. ఖాళీ కాబోయే ఆయా స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 10 రాష్ట్రాల పరిధిలోని ఈ 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు:

జూన్ 1: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

జూన్ 8: నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

జూన్ 9: నామినేషన్ల పరిశీలన

జూన్ 11: నామినేషన్ల ఉపసంహరణకు గడువు

జూన్ 18: ఉదయం నుంచి పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

జూన్ 20: లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు ఎన్నిక:

తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 26తో ముగియనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలతో పాటు సానా సతీష్‌ల పదవీకాలం పూర్తి కానుండటంతో ఏపీలోని ఈ నాలుగు స్థానాలకు కూడా జూన్ 18నే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో అటు ఢిల్లీతో పాటు ఇటు ఏపీ రాజకీయాల్లోనూ అప్పుడే సందడి మొదలైంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story