Rajya Sabha: రాజ్యసభలో 'వందేమాతరం' బిల్లు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష!
Rajya Sabha: జాతీయ గేయం 'వందేమాతరం' గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
Rajya Sabha: రాజ్యసభలో 'వందేమాతరం' బిల్లు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష!
Rajya Sabha: భారత జాతీయ గేయం 'వందేమాతరం' గౌరవాన్ని పునరుద్ధరించడం మరియు దానికి చట్టపరమైన రక్షణ కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చారిత్రాత్మక బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. ఈ నూతన చట్టం ప్రకారం.. జాతీయ గేయమైన వందేమాతరాన్ని అవమానించినా లేదా దానిని ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా దానిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
వందేమాతరం బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971'లో పలు సవరణలు ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశంలో జాతీయ గీతమైన 'జనగణమన'కు ఎలాంటి చట్టపరమైన రక్షణ, గౌరవ నియమాలు వర్తిస్తున్నాయో.. ఇకపై జాతీయ గేయమైన 'వందేమాతరం'కి కూడా అదే స్థాయి రక్షణను వర్తింపజేయడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. వందేమాతరాన్ని అవమానించినట్లు రుజువైతే దోషులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించేలా కఠిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు.
బిల్లుపై సభలో చర్చ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసులు చేసిన బలప్రయోగంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.
డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ్యులను పదే పదే శాంతించి చర్చలో పాల్గొనాలని కోరినప్పటికీ నిరసనలు కొనసాగాయి. కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అఠావలె బిల్లుపై మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల ఆందోళనల మధ్యే సభ ఈ బిల్లును ఆమోదించింది.




