Kangana Ranaut: రక్షా బంధన్ యాడ్ వివాదం.. రాహుల్ గాంధీకి కంగనా రనౌత్ ఘాటు కౌంటర్!

Kangana Ranaut: రక్షా బంధన్ యాడ్ వివాదంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 12:24 PM IST
Kangana Ranaut
X

Kangana Ranaut: రక్షా బంధన్ యాడ్ వివాదం.. రాహుల్ గాంధీకి కంగనా రనౌత్ ఘాటు కౌంటర్!

Kangana Ranaut: బాలీవుడ్ ప్రముఖ నటి కృతి సనన్ నటించిన రక్షా బంధన్ పండుగ ప్రకటన (Ad) చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు తీవ్ర రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారంలో పితృస్వామ్య వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

"పితృస్వామ్యాన్ని కూల్చివేయండి" అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బీజేపీ అధికారిక పోస్ట్‌ను రీషేర్ చేశారు.

"బ్రో.. కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై.. ఇక మీరు చెప్పాల్సింది మొదలుపెట్టండి" అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా బదులిచ్చారు. మహిళల హక్కులు, ప్రాతినిధ్యం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తన గత చరిత్రను పునరాలోచించుకోవాలని కంగనా డిమాండ్ చేశారు.

మహిళల స్వేచ్ఛ, హక్కుల గురించి మాట్లాడే నాయకులు ముందుగా దేశమాతను గౌరవించడం నేర్చుకోవాలని కంగనా పరోక్షంగా హితవు పలికారు. రక్షా బంధన్ ప్రకటనలో దుస్తుల ఎంపికపై బాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ వివాదం, ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన మాటల యుద్ధంగా రూపాంతరం చెందింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story