Parlakhemundi: కార్తీక మాస వేళ మహేంద్ర తనయ నదీ తీరంలో స్వచ్ఛత పనులు!
Parlakhemundi: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని పర్లాఖెముండి మహేంద్ర తనయ నదీ తీరాన్ని సొంత ఖర్చులతో జేసీబీలతో శుభ్రం చేయిస్తూ రంజిత్ మహాపాత్ర స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు.
Parlakhemundi: కార్తీక మాస వేళ మహేంద్ర తనయ నదీ తీరంలో స్వచ్ఛత పనులు!
Parlakhemundi: కార్తీక మాసంలో ప్రజలు పెద్దఎత్తున మహేంద్ర తనయ నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన రంజిత్ మహాపాత్ర గత కొన్నాళ్లుగా తన సొంత సొమ్ముతో నదీ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో మట్టి, చెత్తా చెదారం వల్ల దుర్వాసన వెలువడుతుంది. దీంతో ఈ ఏడాది కూడా జేసీబీ సహాయంతో ఆయా ప్రాంతాలను రంజిత్ శుభ్రం చేయించి స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు.




