Mumbai Family Death Case: ముంబయి ఫ్యామిలీ మృతి కేసులో ట్విస్ట్.. పుచ్చకాయ కల్తీ కాదు.. అసలు కారణం ఇదే!

Mumbai Family Death Case Update: ముంబయిలో పుచ్చకాయ, బిర్యానీ తిని ఒకే కుటుంబంలోని నలుగురు మరణించిన ఘటనలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలక విషయాలను వెల్లడించింది. వారి మృతికి కారణం పుచ్చకాయ కల్తీ కాదని స్పష్టం చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 May 2026 5:00 AM IST
Rat Poison In Watermelon Killed Mumbai Family, Forensic Analysis Reveals
X

Mumbai Family Death Case: ముంబయి ఫ్యామిలీ మృతి కేసులో ట్విస్ట్.. పుచ్చకాయ కల్తీ కాదు.. అసలు కారణం ఇదే!

Mumbai Family Death Case Update: గత నెలలో ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటలకే వారు మరణించడంతో.. పుచ్చకాయ కల్తీ వల్లే ఈ ఘోరం జరిగిందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఈ కేసులో తాజాగా వెలువడిన ఫోరెన్సిక్ నివేదిక ఆ ప్రచారాన్ని పటాపంచలు చేసింది.

ఎలుకల మందే మృత్యుపాశం:

మృతులు అబ్దుల్లా డోకాడియా (44), ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు అయేషా (16), జైనేబ్ (13) మృతదేహాలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు.. వారి శరీరంలో 'జింక్ ఫాస్ఫైడ్' (Zinc Phosphide) అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది సాధారణంగా ఎలుకలను చంపడానికి ఉపయోగించే మందు. కుటుంబ సభ్యులందరి మృతికి ఈ విషమే కారణమని అధికారులు నిర్ధారించారు.

ప్రమాదమా? కుట్రనా?:

పుచ్చకాయ కల్తీ వల్ల మరణం సంభవించలేదని స్పష్టమైనప్పటికీ, ఆ విషం వారి శరీరంలోకి ఎలా చేరిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ప్రమాదవశాత్తు పుచ్చకాయ ముక్కల ద్వారా ఆ విషం లోపలికి వెళ్లిందా?

♦ లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆహారంలో విషం కలిపారా?

♦ లేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణాల్లో జేజే మార్గ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన నేపథ్యం:

ఏప్రిల్ 25న రాత్రి అబ్దుల్లా డోకాడియా కుటుంబం తమ బంధువులతో కలిసి విందులో పాల్గొన్నారు. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు పుచ్చకాయ ముక్కలను తిన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ప్రస్తుతం పోలీసులు మృతుల బంధువులు, ఇరుగుపొరుగు వారి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో విషం ఎలా చేరిందనే అంశంపై క్లారిటీ వస్తేనే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story