Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు!

Udhayanidhi Stalin: నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ రిలీఫ్.

Arun Chilukuri
Published on: 4 Aug 2026 3:41 PM IST
Udhayanidhi Stalin
X

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు!

Udhayanidhi Stalin: ప్రముఖ సినీ నటి త్రిషను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో డిఎంకే (DMK) నేత, తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

కావేరి జిల్లాల నిరసన సభలో నటి త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అనంతరం ఆయన తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో అత్యవసర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో డిఎంకే శ్రేణులు హర్షం వ్యక్తం చేయగా, ఆయన వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story