Jordar Varthalu: నడీ తొవ్వలో బోరింగ్.. నవ్వుకుంటున్న జనాలు

ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్‌లో సీఎం యోగి పర్యటన కోసం అధికారులు వేగంగా రోడ్డు వేశారు.అయితే రోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్ తీయకుండానే రోడ్డు వేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 2:59 PM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: నడీ తొవ్వలో బోరింగ్.. నవ్వుకుంటున్న జనాలు

Jordar Varthalu: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలోని రోడ్లను అధికారులు తలతల మెరిసేలా సిద్ధం చేశారు. అయితే, ఆ హడావిడిలో రోడ్డు మధ్యలో ఉన్న ఒక చేతి పంపు (బోరింగ్) ను తొలగించడం మర్చిపోయారు. ఆ బోరింగ్ చుట్టూనే తారు రోడ్డు వేసి పనులు కానిచ్చేశారు.

నడిరోడ్డుపై ఉన్న ఈ బోరింగ్‌ను చూసి స్థానికులు విస్తుపోతున్నారు. దీనిని స్పీడ్ బ్రేకర్ అనుకున్నారా లేక ట్రాఫిక్ సిగ్నల్ అనుకున్నారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సీఎం మెప్పు పొందాల్సింది పోయి, ఇలాంటి పనుల వల్ల అధికారులు నెటిజన్ల తిట్లు తినాల్సి వస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ "అతి తెలివి" రోడ్డు వీడియో నెట్ ఇంట తెగ వైరల్ అవుతోంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story