Putin: ఐరోపాను మేం ఎప్పుడూ బెదిరించలేదు.. బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు

Putin: ఐరోపాను మేం ఎప్పుడూ బెదిరించలేదు.. నాటో జోక్యం వల్లే ఉక్రెయిన్ యుద్ధం: బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు.

Arun Chilukuri
Published on: 12 Sept 2026 3:11 PM IST
Putin
X

Putin: ఐరోపాను మేం ఎప్పుడూ బెదిరించలేదు.. బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు

Putin: బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ రాజకీయాలు, ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎప్పుడూ ఐరోపా (European countries) దేశాలను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ అలా చేయబోమని స్పష్టం చేశారు. అయితే తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల అనవసర జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం ఇంకా కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు.

ఐరోపా దేశాలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని, కానీ ఉక్రెయిన్‌లోకి మరింత మంది సైన్యాన్ని పంపేందుకు ఆ దేశాల నేతలు చర్చలు జరపడం ద్వారా యుద్ధాన్ని కోరుకుంటున్నారని పుతిన్ పేర్కొన్నారు. వారి జోక్యం వల్లే ఈ సంక్షోభం ముగియడం లేదన్నారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ప్రపంచ దేశాల ఇంధన, ఆహార భద్రతకు సహకరించడానికి రష్యా సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లోనూ అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు మాస్కో తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.

బ్రిక్స్ (BRICS) కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని, ఇందులో ఉన్న దేశాలన్నింటికీ శక్తిమంతమైన దేశీయ మార్కెట్లు ఉన్నాయని తెలిపారు. యావత్ ప్రపంచంతో కలిసి పనిచేయడానికి రష్యా సుముఖంగా ఉందని, ముఖ్యంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పుతిన్ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.