Ukraine Missile Attack: ఉక్రెయిన్ దాడిలో కేరళకు చెందిన భారత నావికుడు మృతి

Ukraine Missile Attack: ఉక్రెయిన్ తీర ప్రాంతంలో రష్యా దళాలు జరిపిన భీకర క్షిపణి దాడి ఒక భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒడెస్సా తీరం సమీపంలో

G Krishna
Published on: 21 July 2026 9:24 AM IST
Indian Sailor from Kerala Near Ukraine Coast
X

Indian Sailor from Kerala Near Ukraine Coast

Ukraine Missile Attack: ఉక్రెయిన్ తీర ప్రాంతంలో రష్యా దళాలు జరిపిన భీకర క్షిపణి దాడి ఒక భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒడెస్సా తీరం సమీపంలో ప్రయాణిస్తున్న 'ఎమ్‌వి గోల్డెన్ లియో' అనే అంతర్జాతీయ సరుకు రవాణా నౌకపై రష్యా బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన 26 ఏళ్ల యవ నావికుడు అఖిల్ జోయన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు భారతీయులు మరణించగా, అందులో అఖిల్ ఒకరు. కాసర్‌గోడ్ జిల్లాలోని వెల్లరిక్కుండుకు చెందిన ఈ యువకుడు మరో రెండు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

కుటుంబానికి ఏకైక జీవనాధారం

అఖిల్ గత ఆరేళ్లుగా మర్చంట్ నేవీలో నావికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే మర్చంట్ నేవీలో చేరిన ఆయన, క్రమశిక్షణతో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. తండ్రి జోయన్ ఒక సాధారణ ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తుండగా, తల్లి సాలీ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా జీవనం సాగిస్తున్నారు. అఖిల్ వారి కుటుంబానికి ఏకైక సంతానం. ఇటీవలనే ఒక ఇల్లు కూడా నిర్మించుకున్న ఆ సాధారణ కుటుంబ భవిష్యత్తు పూర్తిగా అఖిల్ సంపాదనపైనే ఆధారపడి ఉంది. త్వరలోనే మంచి భవిష్యత్తు కోసం వేరే కంపెనీకి మారాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు.

రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే గుండెకోత

స్థానిక ప్రజాప్రతినిధి శోభి జోసెఫ్ తెలిపిన వివరాల ప్రకారం, అఖిల్ మూడు నెలల క్రితమే తన నిశ్చితార్థం కోసం సొంతూరుకి వచ్చారు. ఆలప్పుళ జిల్లాకు చెందిన యువతితో ఆయన వివాహం నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో పెళ్లి ఘనంగా జరగాల్సి ఉంది. నిశ్చితార్థ వేడుకలు ముగించుకుని కేవలం నెల రోజుల క్రితమే ఆయన తిరిగి విధుల్లో చేరారు. ఊరిలో అందరితో ఎంతో మర్యాదగా ఉండే అఖిల్, స్థానిక టగ్-ఆఫ్-వార్ లో మంచి గుర్తింపు ఉన్న క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఇమెయిల్ ద్వారా అందిన విషాద వార్త

సోమవారం సాయంత్రం అఖిల్ పనిచేస్తున్న షిప్పింగ్ కంపెనీ నుంచి వచ్చిన ఒక ఇమెయిల్ ద్వారా ఈ ఘోర వార్త ఆయన కుటుంబానికి చేరింది. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అఖిల్ భౌతికకాయాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యల కోసం కుటుంబ సభ్యులు , స్థానిక నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.

స్పందించిన కేరళ ప్రభుత్వం

ఈ విషాద ఘటనపై కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణమే స్పందించింది. రష్యన్ కాన్సులేట్ , భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పూర్తి వివరాలు సేకరించాలని, భౌతికకాయాన్ని కేరళకు రప్పించేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని నోర్కా (NORKA) విభాగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రమాదం జరిగిందిలా..

అంతర్జాతీయ మీడియా , ఉక్రెయిన్ సీ పోర్ట్స్ అథారిటీ సమాచారం ప్రకారం.. పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ కార్గో నౌక ఉక్రెయిన్ ధాన్యాన్ని లోడ్ చేసుకుని ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరింది. పోర్టు దాటిన కొద్దిసేపటికే రష్యా దళాలు నౌకపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడి తీవ్రతకు నౌకలోని 10 మంది సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారిలో నలుగురు భారతీయులతో పాటు ఐదుగురు సిరియా దేశస్థులు ఉన్నారు. ప్రమాదంలో దెబ్బతిన్న నౌక నుండి మరో ఎనిమిది మంది సిబ్బందిని ఉక్రెయిన్ రక్షణ బృందాలు సురక్షితంగా రక్షించగలిగాయి.

Slug:


Tags:

Ukraine, Russia Ukraine War, Indian Sailor, Akhil Joyan, Kerala, Odesa, Missile Attack, Merchant Navy

SEO Keywords (12):

Indian sailor killed, Akhil Joyan, Russia Ukraine War, Ukraine missile attack, Kerala sailor, MV Golden Leo, Merchant Navy, Odesa attack, Russian missile strike, Indian crew, Ukraine news, World News

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story