Sabarimala: రేపే శబరిమల ఆలయం పునఃప్రారంభం.. 'చింగం' మాస పూజలకు శ్రీకారం..
Sabarimala: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకోనుంది.
Sabarimala: రేపే శబరిమల ఆలయం పునఃప్రారంభం.. 'చింగం' మాస పూజలకు శ్రీకారం..
Sabarimala: కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర (అయ్యప్ప) ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకోనుంది. మలయాళ క్యాలెండర్ ప్రకారం 'చింగం' మాస పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ (TDB) అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం టీడీబీ మరియు కేరళ ఆర్టీసీ (KSRTC) విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ పూజారి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో, ప్రధాన పూజారి ప్రసాద్ ఇ.డి. ఆలయ ద్వారాలను సాంప్రదాయబద్ధంగా తెరుస్తారని బోర్డు ప్రకటనలో తెలిపింది.
మలయాళ నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని ఈనెల 17వ తేదీ ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. చింగం మాస పూజలు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 వరకు కొనసాగుతాయి. చింగం మాస ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం ఆగస్టు 21వ తేదీ రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఓనం పండుగ ప్రత్యేక పూజల కోసం తిరిగి ఈనెల 24న శబరిమల ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు.




