Samrat Choudhary: బిహార్ సీఎంగా సమ్రాట్ చౌధరి ప్రమాణస్వీకారం..!

Samrat Choudhary: బిహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సమ్రాట్ చౌధరి ప్రమాణస్వీకారం చేశారు.

Arun Chilukuri
Published on: 15 April 2026 12:17 PM IST
Samrat Choudhary
X

Samrat Choudhary: బిహార్ సీఎంగా సమ్రాట్ చౌధరి ప్రమాణస్వీకారం..!

Samrat Choudhary: బిహార్ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలైంది. బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌధరి బిహార్ 21వ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు.

బిహార్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) తరపున ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి నాయకుడిగా సమ్రాట్ చౌధరి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు కూటమిలో జూనియర్ భాగస్వామిగా లేదా ఉపముఖ్యమంత్రి పదవులకే పరిమితమైన బీజేపీ, తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది.

జేడీ(యూ) అధినేత నీతీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో మంగళవారం తన సీఎం పదవికి రాజీనామా చేశారు. సమ్రాట్ చౌధరితో పాటు బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌధరిలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమ్రాట్ చౌధరికి మాజీ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story